మెడికల్‌ థ్రిల్లర్‌ మార్షల్‌


Wed,September 11, 2019 11:38 PM

Srikanth Speech At Marshal Movie Pre Release Event

‘ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో ‘మార్షల్‌' చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాను ఒప్పుకోకపోయుంటే మంచి కథలో భాగమయ్యే అవకాశం కోల్పోయేవాణ్ణి’ అని అన్నారు హీరో శ్రీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌'. అభయ్‌ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. జై రాజాసింగ్‌ దర్శకుడు. మేఘాచౌదరి కథానాయిక. రేపు ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘అభయ్‌ హీరోగా నటిస్తూనే ధైర్యంగా ముందడుగు వేసి సినిమాను నిర్మించారు. సాధారణంగా కొత్త దర్శకులు క్లిష్టమైన కథాంశాల్ని ఎంచుకునే సాహసం చేయరు. కానీ రాజాసింగ్‌ మాత్రం నవ్యమైన ఇతివృత్తంతో మెడికల్‌ థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కించారు’ అని చెప్పారు.

అభయ్‌ మాట్లాడుతూ ‘వైద్యరంగం నేపథ్యంలో వాణిజ్య హంగులు జోడించి సినిమాను రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధంతో పాటు వినోదం, యాక్షన్‌ కలబోతగా ఉంటుంది. శ్రీకాంత్‌తో నా కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది’ అని తెలిపారు. కొత్తదనాన్ని నమ్మి ఈ సినిమా చేశామని, తన కథనునమ్మి అభయ్‌, శ్రీకాంత్‌ ఈ సినిమా చేశారని దర్శకుడు జైరాజాసింగ్‌ పేర్కొన్నారు. ‘తొలి సినిమాతోనే కొత్త కథను ఎంచుకున్నాడు అభయ్‌. హీరోగా అతడికి ఈ చిత్రం శుభారంభాన్ని అందివ్వాలి’ అని తమ్మారెడ్డిభరద్వాజ్‌ అన్నారు. ‘కేజీఎఫ్‌' తర్వాత తాను సంగీతాన్ని అందించిన చిత్రమిదని రవి బర్సుర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల యాదగిరి, మేఘాచౌదరి తదితరులు పాల్గొన్నారు.

371

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles