అంజలి ప్రేమలేఖ


Wed,May 8, 2019 12:23 AM

srikanth and maruthi launch trailer itlu anjali

ట్రైలర్ బాగుంది. శ్రీకార్తికేయతో పాటు యూనిట్ అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. కార్తిక్ శ్రావ్యమైన పాటల్ని అందించారు అని అన్నారు దర్శకుడు మారుతి. శ్రీకార్తికేయ, హిమాన్షీ, శుభాంగి పంత్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఇట్లు అంజలి. నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి విడుదలచేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ ప్రేమలేఖ ఆధారంగా కథ సాగుతుంది. ఆ లేఖ రాసిందెవరు?ఎవరి కోసం రాశారు? అన్నది అలరిస్తుంది అని చెప్పారు. బాలనటుడిగా ఆ నలుగురుతో పాటు పలు సినిమాలు చేశానని, మంచి కథతో హీరోగా పరిచయం కానుండటం ఆనందంగా ఉందని శ్రీకార్తికేయ చెప్పారు.

929

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles