మీసం మెలేసే పొగరు

Sun,October 13, 2019 12:12 AM

‘మనుషులకు ఎన్నో వ్యసనాలుంటాయి. అతనికి శత్రువు కూడా ఓ వ్యసనమే. ప్రత్యర్థుల కుట్రలను ఛేదించడానికి ఆ యువకుడు ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?’ అనే ఆసక్తికర అంశాల సమాహారమే మా చిత్ర ఇతివృత్తం’ అంటున్నారు ఎల్‌. కృష్ణవిజయ్‌. ఆయన దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందించిన చిత్రం ‘తిప్పరా మీసం’. నిక్కీ తంబోలి కథానాయిక. నవంబర్‌ 8న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల థియేట్రికల్‌ హక్కులను ఏషియన్‌ ఫిల్మ్స్‌ సునీల్‌నారంగ్‌ సొంతం చేసుకున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీవిష్ణు పాత్ర చిత్రణ గత చిత్రాలకు భిన్నంగా శక్తివంతంగా సాగుతుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. టైటిల్‌కు తగినట్లుగానే రొమాంచితమైన యాక్షన్‌ ఘట్టాలతో ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిధ్‌, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నిర్మాణ సంస్థలు: రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కృష్ణ విజయ్‌ ఎల్‌ ప్రొడక్షన్స్‌, శ్రీఓం సినిమా.

318

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles