కొత్త దర్శకుడితో..

Thu,October 3, 2019 12:11 AM

శ్రీ విష్ణు కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. హాసిత్‌ గోలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘భిన్నమైన కథ, కథనాలతో రూపొందనున్న చిత్రమిది. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హాసిత్‌ గోలి నవ్యమైన పాయింట్‌ను సిద్ధంచేశారు. హీరోగా శ్రీవిష్ణును కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వివేక్‌ కూచిభోట్ల, కీర్తిచౌదరి.

370

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles