ముగ్గురు మిత్రుల హంగామా


Fri,March 22, 2019 12:04 AM

sree vishnu and priyadarshi and rahul ramakrishna brochevarevarura first look

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్రోచేవారెవరురా. చలనమే చిత్రము..చిత్రమే చలనము ఉపశీర్షిక. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్‌కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. నివేథా థామస్ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో హీరో శ్రీవిష్ణు, హాస్యనటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి స్కూటర్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్రైమ్ కామెడీ కథాంశమిది. శ్రీవిష్ణు పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ నడుస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. సత్యదేవ్, నివేదాపేతురాజ్, ప్రియదర్శి, రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరాం, సంగీతం: వివేక్‌సాగర్, ఎడిటర్: రవితేజ గిరిజాల, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.

1285

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles