మైండ్ రీడర్ కథ


Wed,May 8, 2019 12:25 AM

Special Movie Release Date Announcement Press Meet

సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న సూపర్‌నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇతర భాషల వారికి గర్వంగా చూపించేలా ఉంటుంది అని అన్నారు వాస్తవ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పెషల్. ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ఉపశీర్షిక. అజయ్, రంగ, అక్షత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నందమ్‌శ్రీవాస్తవ్ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ దేశం మొత్తం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సామాజిక బాధ్యతతో తెరకెక్కించాం.తెలుగులో అరుదుగా వచ్చే కథాంశమిది.

వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో కాకుండా మంచి సినిమా తీయాలనే సంకల్పంతో ఈ ప్రయత్నం చేశాం అని తెలిపారు. బాపిరాజు మాట్లాడుతూ కథ నచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ర్టాల్లో విడుదలచేస్తున్నాను. క్షణం, గూఢచారి తరహాలో సరికొత్త అనుభూతిని పంచుతుంది. అజయ్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది
అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగ పాల్గొన్నారు.

516

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles