రజనీ కుమార్తె ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

Sat,February 9, 2019 12:20 AM

ప్రముఖ హీరో రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ శుక్రవారం చెన్నైలో జరిగింది. సినీ నటుడు, ఫార్మా కంపెనీ అధినేత విషగన్ వనగమూడితో సౌందర్య రజనీకాంత్ వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే రిసెప్షన్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు తెలిసింది. ఈ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సౌందర్య బంగారు వర్ణం పట్టుచీరలో, వరుడు పట్టు వస్ర్తాల్లో మెరిశారు. వేదికపై ఐశ్వర్య, రజనీ, లత వున్నారు. ఈ నెల 11న చెన్నైలో వీరి వివాహం జరగనున్నట్లు తెలిసింది.

2668

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles