ఆకాశమే హద్దుగా..

Mon,November 11, 2019 12:15 AM

జయాపజయాలకు అతీతంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తుంటారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తూ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రానికి ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. అపర్ణ బాలమురళి కథానాయిక. టైటిల్‌తో పాటు సూర్య ఫస్ట్‌లుక్‌ను ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. గాలిలో ఎగురుతూ ైస్టెలిష్ అవతారంలో సూర్య కనిపిస్తున్నారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తక్కువ వ్యయంతో సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో గోపీనాథ్‌కు ఎదురైన అవరోధాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నది.మోహన్‌బాబు ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. జాకీష్రాఫ్, ప్రతాప్‌పోతన్, పరేష్‌రావల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సినిమాటోట్రఫీ: శ్రీనికేత్ బొమ్మిరెడ్డి, స్క్రీన్‌ప్లే: శాలిని ఉషాదేవి, సుధా కొంగర.

397

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles