సందీప్ కోసం సిద్ధార్థ్ పాట!

Sun,March 10, 2019 12:00 AM

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ దయా మన్నెం, విజి సుబ్రహ్మణ్యన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం నినువీడని నీడను నేనే. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అన్యాసింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కోసం హీరో సిద్ధార్థ్ ఎక్స్ క్యూజ్ మీ రాక్షసి అంటూ సాగే పాట పాడారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ తెలుగులో పాడటం అంటే ఎప్పుడూ సంతోషంగానే వుంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తియ్యగా వుంటుంది. నటుడిగా నాకు గుర్తింపు, గౌరవం, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది తెలుగు సినిమానే. తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు ప్రత్యేక అభిమానం. నేను ఈ పాట పాడటానికి ఒకటే కారణం. నాకు సందీప్‌కిషన్ అంటే ఇష్టం. తను నాకు తమ్ముడిలాంటి వాడు. తన కోసమే ఈ పాట పాడాను అన్నారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ సిద్ధార్థ్ నా కెరీర్ తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. తను పాడిన పాటలకు నేను పెద్ద అభిమానిని. తొలిసారి నేను నిర్మిస్తున్న సినిమాలో తను ఓ భాగం అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ పాట పాడించాను. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ అన్నారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భాగ్యరాజా, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. కెమెరా: ప్రమోద్‌శర్మ.

1074

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles