సాఫ్ట్‌వేర్ ఎంటర్‌టైనర్

Thu,November 7, 2019 11:01 PM

సుడిగాలిసుధీర్, ధన్యబాలకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడు. కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో విడుదలకానుంది. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో వినోదంతో పాటు వాణిజ్య హంగులు మిళితమైన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం.


దివంగత నటుడు శివప్రసాద్ నటించిన చివరి సినిమా ఇది అని చెప్పారు. తొలి సినిమాతోనే గౌతంరాజు, రామ్‌ప్రసాద్ లాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో పనిచేయడం ఆనంద ఉందని సుడిగాలి సుధీర్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చి నిర్మించాం. సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ ఓ పాట పాడటమే కాకుండా నటించారు. కమర్షియల్ హంగులకు చక్కటి సామాజిక సందేశాన్ని మేళవించి రూపొందించాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధన్యబాలకృష్ణ పాల్గొన్నారు.

649

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles