స్వీయ దర్శకత్వంలో..


Tue,May 14, 2019 01:12 AM

small break kamal haasan bharateeyudu-2

కమల్‌హాసన్, శివాజీగణేషన్ ప్రధాన పాత్రల్లో 1992లో రూపొందిన తమిళ చిత్రం దేవర్‌మగన్ ఐదు జాతీయ పురస్కారాలతో పాటు పలు అవార్డులను దక్కించుకున్నది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో గ్రామీణ ఇతివృత్తంతో దర్శకుడు భరతన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు కమల్‌హాసన్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్వనిర్మాణ పనులను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం కమల్‌హాసన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆ పనులు పూర్తికాగానే సీక్వెల్‌ను ప్రారంభిస్తారని సమాచారం. శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 చిత్రాన్ని అంగీకరించారు కమల్‌హాసన్. జనవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ సినిమా ఆగిపోయినట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్-2కార్యరూపం దాల్చకపోవడంతో కమల్‌హాసన్ దేవర్‌మగన్-2 రూపొందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

616

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles