శివలింగాపురంలో..


Fri,May 10, 2019 12:03 AM

Sivalingapuram Movie Relese on June

ఆర్.కె.సురేష్ హీరోగా నటిస్తున్న చిత్రం శివలింగాపురం. తోట కృష్ణ దర్శకుడు. రావూరి వెంకటస్వామి నిర్మాత. మధుబాల కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏమిటన్నదే చిత్ర కథ. ఆధ్యాత్మిక అంశాల కలబోతగా సాగుతుంది. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది అన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. ప్రియాపృథ్వి, ప్రదీప్ తదితరులు తారాగణం.

813

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles