శివలింగాపురం కథ

Wed,November 6, 2019 12:07 AM

ఆర్.కె.సురేష్, మధుబాల నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం శివలింగాపురం. రావూరి వెంకటస్వామి నిర్మాత. తోట కృష్ణ దర్శకుడు. ఈ నెల 8న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాత మాట్లాడుతూ గ్రామీణ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. యాక్షన్, వాణిజ్య హంగుల మేళవింపుతో భక్తిరస ప్రధానంగా రూపొందించాం. తమిళ నటుడు ఆర్.కె.సురేష్‌ను ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం చేస్తున్నాం. తెలుగులో ఈ నెల 8న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 23న విడుదలచేయనున్నాం అని తెలిపారు. శివలింగాపురంలో ఏం జరిగిందన్నది ఉత్కంఠను పంచుతుందని, యువతరంతో పాటు అన్ని వర్గాలను అలరించే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. తన కెరీర్‌ను మలుపుతిప్పే మంచి సినిమా ఇదని మధుబాల చెప్పింది.

321

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles