శివలింగాపురం కథ


Mon,June 10, 2019 12:10 AM

Sivalingapuram Audio Launch

ఆర్.కె. సురేష్, మధుబాల నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం శివలింగాపురం. తోట కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. ఆడియో సీడీలను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించగా, ప్రచార చిత్రాన్ని హీరో ఆర్.కె. సురేష్ విడుదలచేశారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్న సినిమాలు ఎక్కువగా వచ్చినప్పుడే పరిశ్రమను నమ్ముకున్న వారందరికి ఉపాధి దొరుకుతుంది. ట్రైలర్, టీజర్ బాగున్నాయి అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ గతంలో మా సంస్థపై లిటిల్‌హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకోతో పాటు మరికొన్ని సినిమాల్ని నిర్మించాను. నిర్మాత ఆరవ చిత్రమిది. ఈ నెలాఖరులో విడుదల చేస్తాం అని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ఇది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచుతుంది అని దర్శకుడు చెప్పారు.

1518

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles