కౌసల్య కృష్ణమూర్తి


Mon,May 20, 2019 11:34 PM

sivakarthikeyan plays a special role in telugu movie kousalya krishnamurthy the cricketer

రాజేంద్రప్రసాద్,ఐశ్వర్యారాజేష్, కార్తిక్‌రాజు, వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ వల్లభ నిర్మిస్తున్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే చిత్రమిది. క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఎన్నో అవరోధాల్ని దాటుకొని తండ్రికి, దేశానికి ఓ మహిళా క్రికెటర్ ఎలా పేరుతీసుకొచ్చిందన్నది ఆకట్టుకుంటుంది. మా సంస్థలో మరో మంచి సినిమాగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని తెలిపారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్య ఇతివృత్తమిది. క్రికెట్‌తో పాటు రైతుల సమస్యల్ని చర్చిస్తూ సాగుతుంది అన్నారు.

1186

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles