మార్షల్ ఆర్ట్స్ పవర్..


Wed,December 12, 2018 11:18 PM

Siva Jonnalagadda Police Power movie launched

శివ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సూపర్ పవర్ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సారిపల్లి కొండలరావు క్లాప్ నివ్వగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విఛాన్ చేశారు. వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాల సమ్మేళనంగా సాగుతుంది. సూపర్ పవర్ కప్‌ను సాధించే క్రమంలో ఓ వ్యక్తికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని ఎదుర్కొని తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో పది పోరాట ఘట్టాలుంటాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు.

1225

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles