అభినవ సీత కోసం!


Sun,March 10, 2019 12:02 AM

sita movie releasing on april 25th

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. మన్నారా చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌ల పాత్రలు కొత్తగా వుంటాయి. నటనకు ఆవకాశమున్న పాత్రల్లో కనిపిస్తారు. అభినవ సీత కోసం ఓ యువకుడు ఏం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. సోనూసూద్, మన్నారా చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి షెడ్యూల్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శిర్షారే, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: కణల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సమర్పణ: ఏ టీవి.

2394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles