విమర్శల్ని స్వీకరించాల్సిందే!


Thu,May 16, 2019 12:08 AM

Sita Movie Music Director Anup Rubens Interview

‘కథలలో నవ్యత ఉన్నప్పుడే కొత్తగా సంగీతాన్ని అందించడానికి అవకాశం దొరుకుతుంది’ అని అన్నారు అనూప్‌రూబెన్స్‌. ఆయన స్వరకర్తగా పనిచేస్తున్న చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో అనూప్‌రూబెన్స్‌ మాట్లాడుతూ ‘సీత అనే పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో పాటలు, నేపథ్యసంగీతం కథానుగుణంగానే ఉంటాయి. ఇప్పటికే విడుదల చేసిన ‘బుల్‌రెడ్డి..’,‘నిజమేనా..’ గీతాలకు మంచి స్పందన లభిస్తున్నది. మ్యూజికల్‌గా ‘జయం’ రోజులు గుర్తొచ్చాయని అంటున్నారు. పెద్ద సినిమాలు కొన్ని వర్కవుట్‌ కాకపోవడంతో సంగీత దర్శకుడిగా ఏడాదిపాటు విరామం తీసుకున్నాను. ప్రశంసల్ని స్వీకరించినప్పుడు విమర్శల్ని అంగీకరించాల్సిందే. గతంలో ఏడాదికి పది వరకు సినిమాలు చేశాను. ఆ సమయంలో తెలియకుండానే కొన్ని సార్లు ఒకే రకమైన ట్యూన్స్‌ పునరావృతం అయ్యాయి. పని ఒత్తిడి వల్లే అలా జరిగింది. తెలుగులో కార్తికేయ నటిస్తున్న ‘90ఎమ్‌ఎల్‌'తో పాటు కన్నడంలో ‘సీతారామకళ్యాణం’, హీరో గణేష్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాను.

514

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles