సిరివెన్నెల గీతాలు


Mon,July 22, 2019 12:00 AM

sirivennela official trailer launched

ప్రియమణి ప్రధా పాత్రలో నటిస్తున్న చిత్రం సిరివెన్నెల. ప్రకాష్ పులిజాల దర్శకుడు. కమల్‌బోరా, ఏఎన్‌భాషా, రామసీత నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతావిష్కరణ జరిగింది. ప్రియమణి మాట్లాడుతూ ఈ కథ బాగా నచ్చింది. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్సింగ్స్ మొదలైనట్లే. టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అన్నారు. మహానటి చిత్రంలో నటించిన చిన్నారి సాయితేజస్విని సిరివెన్నెల పాత్రను పోషించింది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. పాప చుట్టూ కథ నడుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించే చిత్రమిది అని దర్శకుడు చెప్పారు. తన మనవరాలు సాయితేజస్విని సినిమాలో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉందని సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో వైవిధ్యమైన సినిమాగా నిలిచిపోతుందని నిర్మాత కమల్ బోరా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, వైవీయస్ చౌదరి, ఆర్.పి.పట్నాయక్, ఎం.ఎం.కీరవాణి తదితరులు పాల్గొన్నారు.

389

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles