సిద్దార్థ్ ప్రేమాలయం


Thu,February 14, 2019 11:38 PM

siddhartha premalayam to release soon

సిద్దార్థ్, వేదిక, అనైక సోఠి నాయకానాయికలుగా నటించిన తమిళ చిత్రం కావ్య తలైవాన్. వసంతబాలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రేమాలయం పేరుతో నిర్మాత శ్రీధర్ యచ్చర్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్రేమ, ప్రతీకారంతో ముడిపడిన చిత్రమిది. రంగస్థల కళాకారులైన ఇద్దరు యువకుల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఆసక్తిని కలిగిస్తాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి వనమాలి, కందికొండ సాహిత్యాన్ని, రాజశేఖర్‌రెడ్డి మాటలను అందించారు. త్వరలో పాటల్ని విడుదలచేస్తాం అని తెలిపారు.

1475

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles