‘సంఘమిత్ర’ కోసం కత్తి పట్టింది!


Thu,April 20, 2017 12:23 AM

shruti-hassan
గ్లామర్ పాత్రలకే తాము పరిమితమనే భావనను చెరిపేస్తున్నారు నేటితరం తారలు. ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలతో ప్రతిభను చాటుతున్నారు. మనసుకు నచ్చిన పాత్ర దొరికితే దానికి తెరపై పరిపూర్ణంగా న్యాయం చేయడానికి తపిస్తున్నారు. సెట్స్‌లో అడుగుపెట్టడానికి ముందే పాత్ర తీరుతెన్నులను ఆకళింపు చేసుకొని దానిలో ఒదిగిపోతున్నారు. తాజా చిత్రం సంఘమిత్ర కోసం శృతిహాసన్ కత్తియుద్ధాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పోరాట యోధురాలైన యువరాణిగా ఆమె పాత్ర శక్తివంతంగా సాగనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ప్రస్తుతం శృతిహాసన్ లండన్‌లో యుద్ధవిద్యల్లో నిపుణుడైన ప్రత్యేక శిక్షకుడి పర్యవేక్షణలో కత్తి యుద్దాలకు సంబంధించిన మెళుకువలను నేర్చుకుంటున్నది. తెరపై తన పాత్రను మరింత శక్తివంతంగా ఆవిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి అంశంపై పట్టు సాధించే పనిలో ఉన్నట్లు తెలిసింది. కత్తి సాముతో పాటు యుద్ధ సమయాల్లో అమలుపరిచే నైపుణ్యాలను గురించి పూర్తిగా నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఆర్య, జయంరవి ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

943

More News

VIRAL NEWS