తమన్నాను పెళ్లాడేదాన్ని!


Fri,March 15, 2019 11:39 PM

shruti haasan says she would marry tamannaah bhatia if she were a man

నేను అబ్బాయినైతే తమన్నాతో డేటింగ్ చేసేదాన్ని. పెళ్లి కూడా చేసుకునేదాన్ని. చక్కటి వ్యక్తిత్వం తమన్నాది అంటూ తన మిత్రురాలు తమన్నాపై ప్రశంసల వర్షం కురిపించింది శృతిహాసన్. దక్షిణాది చిత్రసీమలో శృతి, తమన్నాలది చక్కటి స్నేహబంధం. విరామ సమయాల్లో వీరిద్దరూ తమ మిత్రబృందంతో కలిసి ఉల్లాసంగా గడుపుతుంటారు. ముంబయి, చెన్నైల్లో తరచుగా పార్టీలకు హాజరవుతుంటారు. ఇటీవల ఓ తమిళ టీవీషోలో పాల్గొన్న శృతిహాసన్..,తమన్నాతో తనకున్న అనుబంధం గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ తమన్నా గొప్ప మనసున్న మనిషి. స్నేహానికి చాలా విలువిస్తుంది. ఎలాంటి సమయంలోనైనా నేనున్నానంటూ ముందుకొస్తుంది. అలాంటి అమ్మాయిని ఎవరూ మిస్ చేసుకోరు. అందుకే నేను అబ్బాయిగా పుట్టివుంటే తప్పకుండా తమన్నానే పెళ్లాడేదాన్ని అంటూ చమత్కరించింది. కాటమరాయుడు తర్వాత శృతిహాసన్ మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న చిత్రం ద్వారా శృతిహాసన్ తిరిగి టాలీవుడ్‌లో పునరాగమనం చేయబోతున్నదని సమాచారం. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టు మైకేల్ కోర్సల్‌తో శృతిహాసన్ గత కొంతకాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది. ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

3579

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles