సరికొత్త ప్రయోగం


Sun,January 14, 2018 11:48 PM

shriya sarans new avatar in Gnana shekar v s Movie

sreya-saran
సీనియర్ కథానాయిక శ్రియ ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే మెరిసిన ఈ అమ్మడు తాజా చిత్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన అమాయకురాలైన అమ్మాయిగా కనిపించనుంది. సుజన దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మించనున్నారు. సంగీతప్రధానంగా సాగే ఈ సినిమాలో శ్రియ పాత్ర చిత్రణ నవ్య పంథాలో సాగుతుందని, ఆమె కెరీర్‌లో విలక్షణ చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర బృందం చెబుతున్నది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్చి నెలలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించనున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలందిస్తారు.

1095

More News

VIRAL NEWS

Featured Articles