ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ జోడీగా?


Wed,April 17, 2019 12:20 AM

Shraddha Kapoor to replace Daisy Edgar Jones in SS Rajamoulis next RRR

ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. దానయ్య నిర్మాత. దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. చారిత్రక కథకు కాల్పనిక అంశాల్ని జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే గుజరాత్, హైదరాబాద్‌లో షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. త్వరలో పుణేలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియాభట్ కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ సుందరి డైసీ ఎడ్గార్‌జోనాస్ నటించనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సుందరి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో కథానాయికల కోసం చిత్ర బృందం అన్వేషణ సాగిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం శ్రద్ధాకపూర్‌ను ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేయొచ్చని తెలిసింది. ప్రస్తుతం శ్రద్ధాకపూర్...ప్రభాస్ సరసన సాహోలో నటిస్తున్నది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకానుంది. తెలుగులో అరంగేట్ర చిత్రం విడుదల కాకముందే మరో ప్రతిష్టాత్మక చిత్రంలో ఆఫర్‌ను చేజిక్కించుకొని శ్రద్ధాకపూర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ బాలీవుడ్‌లో చిచోరే, స్ట్రీట్‌డ్యాన్సర్ చిత్రాల్లో నటిస్తున్నది.

3125

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles