ప్రేక్షకులు నిర్ణయిసే ్తఏదైనా జరగొచ్చు


Mon,August 12, 2019 11:24 PM

shivajiraja edaina jaragochu trailer released

దర్శకుడు రమాకాంత్ ఈ సినిమాకు అసలైన హీరో. రమాకాంత్ చెప్పిన కథను నమ్మే ఈ సినిమాతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను అతడికి అప్పగించాను. సినిమా విజయవంతమైతే నాకంటే ఎక్కువ సంతోషించేవారు ఎవరూ ఉండరు అని అన్నారు శివాజీరాజా. ఆయన తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఏదైనా జరగొచ్చు. కె. రమాకాంత్ దర్శకుడు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాషాసింగ్, పూజా సోలంకీ కథానాయికలు. ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో నటుడు శివాజీరాజా విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నన్ను ఆదరించినట్లుగానే మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి.

సినిమా అద్భుతంగా, గొప్పగా ఉంటుందని, నటీనటులు ఇరగదీశారని నేను చెప్పను. 23 తర్వాత ప్రేక్షకులే బాగుందో లేదో నిర్ణయిస్తారు. విజయ్‌రాజా పాత్ర ప్రత్యేకతలేమీ లేకుండా కథలో అంతర్భాగంగా సాధారణంగా ఉంటుంది అని అన్నారు. డార్క్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఏప్రిల్ ఒకటిన పుట్టిన ముగ్గురు యువకులు చేసిన సరదా పనులు వారిని ఎలా ఇబ్బందుల్లోకి నెట్టాయన్నది ఆసక్తిని పంచుతుంది. తొలి సినిమా అయినా ఎలాంటి భయం లేకుండా విజయ్‌రాజా అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు అని దర్శకుడు చెప్పారు. అమ్మనాన్నల ప్రోత్సాహం వల్లే తాను నటుడిని కాగలిగానని విజయ్‌రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, జగన్, రాఘవ, రవి తదితరులు పాల్గొన్నారు.

351

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles