జెమ్ యాక్షన్ హంగామా


Sat,June 15, 2019 11:41 PM

shivaji raja son vijay raja new movie gem launched

శివాజీరాజా తనయుడు విజయరాజా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జెమ్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాశిసింగ్ కథానాయిక. పత్తికొండ కుమారస్వామి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్‌నివ్వగా, గంగుల ప్రతాపరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. యస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సంవత్సరం పాటు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశాను. యాక్షన్ అంశాలు మేళవించిన కథ ఇది. విజయ్ బాడీలాంగ్వేజ్‌కు బాగా సూట్ అయింది అన్నారు. యువతను ఆకట్టుకునే అన్ని అంశాలున్న చిత్రమిదని, జూలై రెండోవారంలో చిత్రీకరణ ప్రాంరభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తారని శివాజీరాజా తెలిపారు. సోనార్, అలోక్‌జైన్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఆర్ట్: బాలకృష్ణ, సంగీతం: సునీల్‌కశ్యప్, దర్శకుడు: సుశీల సుబ్రమణ్యం.

527

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles