శర్వా రణరంగం


Sat,May 25, 2019 10:58 PM

sharwanand kajal aggarwals rana rangam first look released

శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రణరంగం అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శనివారం ఫస్ట్‌లుక్‌తో పాటు, టైటిల్ టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో శర్వానంద్ ఒకరు. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. గత చిత్రాలతో పోలిస్తే శర్వా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఎమోషన్‌తో కొత్త పంథాలో సాగుతుంది. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితంలో 1990, 2000 మధ్య కాలంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సరికొత్త కథ, కథనాలతో సాగే ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో వున్నాం.

ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసం వుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టైటిల్ టీజర్, ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నాం అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్, కార్తీక్, సంగీతం: ప్రశాంత్ పిైళ్లె, ఛాయాగ్రహణం: దివాకర్‌మణి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణచైతన్య, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్. సమర్పణ: పీడీవీ ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ.

1165

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles