ఆగస్ట్ 15న రణరంగం


Wed,July 17, 2019 12:12 AM

Sharwanand and Sudheer Verma Ranarangam is released on August 15

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. సుధీర్‌వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1990-2000 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనల సమాహారమే చిత్ర ఇతివృత్తం. గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా సాగుతుంది. 90ల నాటి ఆయన లుక్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. యాక్షన్ హంగులు, భావోద్వేగాల కలబోతగా అందరిని మెప్పిస్తుంది. ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దివాకర్‌మణి, సంగీతం: ప్రశాంత్‌పిైళ్లె, ఎడిటర్: నవీన్‌నూలి, మాటలు: అర్జున్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, రచన-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

650

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles