వృద్ధుడి పాత్రలో...?


Sun,January 6, 2019 11:25 PM

sharwanand act in two characters

కేవలం విజయాలు సాధిస్తే సరిపోదు. పాత్రలపరంగా ప్రయోగాలు చేసినప్పుడే ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోగలుగుతామని నమ్ముతున్నారు మన యువహీరోలు. ఈ దిశగా వైవిధ్యమైన పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజా చిత్రంలో యువహీరో శర్వానంద్ వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే... సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందట. ఈ చిత్ర కథకు 1980దశకాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. కథానుగుణంగా కొన్ని సన్నివేశాల్లో ఆయన వృద్ధుడిగా కనిపిస్తారని తెలిసింది. ప్రోస్థటిక్ మేకప్ ద్వారా వృద్ధుడి గెటప్‌ను తీర్చిదిద్దుతున్నారు. కల్యాణిప్రియదర్శిని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.

2108

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles