కొత్త కలయికలో..!

Tue,January 22, 2019 11:43 PM

శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కగా ఈ సినిమా తరువాత శర్వానంద్ యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. విభిన్నమైన రొమాంటిక్ ప్రేమకథ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్ర కథని ఇప్పటికే హీరో శర్వానంద్‌కు దర్శకుడు చందు మొండేటి వినిపించారని, ప్రస్తుతం చిత్ర కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని అన్నీ కుదిరితే త్వరలో సెట్స్‌మీదికి రానుందని తెలిసింది. కాగా శర్వానంద్‌తో తొలి ప్రయత్నంగా పడి పడి లేచే మనసు చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.

1477

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles