ఒకే ఒక్కడు సీక్వెల్?


Sat,July 6, 2019 12:51 AM

Shankar for a sequel of Mudhalvan Oke Okkadu in Telugu

అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ముదల్‌వన్(తెలుగులో ఒకే ఒక్కడు) మంచి వసూళ్లను సాధించింది. ఒక రోజు ముఖ్యమంత్రి అనే పాయింట్‌తో రాజకీయ ఇతివృత్తానికి సందేశాన్ని జోడిస్తూ వినూత్నంగా ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు శంకర్. 0 ptతాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తమిళ అగ్ర హీరో విజయ్ ఈ సీక్వెల్‌లో కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. తొలి భాగం తరహాలోనే సమకాలీన రాజకీయాలు, అవినీతి ప్రధానాంశాలుగా ముదల్‌వన్-2 రూపొందనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న బిగిల్ సినిమాతో విజయ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ముదల్‌వన్-2 సెట్స్‌పైకిరానున్నట్లు సమాచారం.

1519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles