పోలీస్ సింహం


Sun,April 14, 2019 11:28 PM

shakalaka shankar new movie nalugo simham

షకలక శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నాలుగో సింహం. ఆర్.ఎ.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జానీ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ షెట్టి కథానాయిక. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ షకలక శంకర్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిని అరికట్టడంలోఅలసత్వాన్ని ప్రదర్శించే అవినీతి అధికారుల భరతం పట్టే పవర్‌ఫుల్ పాత్రలో షకలక శంకర్ కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ చాలా భిన్నంగా వుంటుంది. ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ తన చుట్టూ జరిగే అన్యాయాలపై ఎలా ఎదురుతిరిగాడు? చివరికి ఏం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.

చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ముద్దమందారం పూర్ణిమ, ఆర్.కె, గుర్లిన్ చోప్రా, గబ్బర్‌సింగ్ బ్యాచ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రవణ్‌కుమార్, సంగీతం: అజయ్ పట్నాయక్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: జానీ.

1178

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles