షారుఖ్ చిత్రంలో రజనీకాంత్?


Sun,August 13, 2017 12:35 AM

rajini
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఎంతగానో ఆరాధిస్తారు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. తలైవా(రజనీ)పై వున్న అభిమానాన్ని చాటుకోవడానికి చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగి డ్యాన్స్ గీతాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. తాజా సమాచారం ప్రకారం షారుఖ్‌ఖాన్ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించబోతున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే...షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో శిద్యాత్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. షారుఖ్‌ఖాన్ అభ్యర్థన మేరకు ఈ చిత్ర కథాంశాన్ని విన్న రజనీకాంత్ ఇందులో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. షారుఖ్ సరసన దీపికాపదుకునే కథానాయికగా నటించనుంది.

377

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS