తమిళంలో సూర్య..హిందీలో షారుఖ్

Tue,March 12, 2019 11:58 PM

వివాదాస్పద అంతరిక్ష శాస్త్రవేత్త నంబీ నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. మాధవన్ టైటిల్ పాత్రలో నటిస్తూ అనంత్ మహదేవన్‌తో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారత అంతరిక్ష రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారనే అభియోగంతో 50 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు నంబీనారాయణన్. ఆయన జీవితంలోని ఈ యాభై రోజుల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా రూపొందుతున్నది.
hero-suriya
తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ వర్షెన్‌లో సూర్య, హిందీలో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పాత్రల నిడివి తక్కువైనా కథకు కీలకంగా ఉంటాయని సమాచారం.

1127

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles