తిరస్కరించిన వారే..

Published: Mon,June 17, 2019 11:26 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఒకప్పుడు తనకు అవకాశాలివ్వడానికి నిరాకరించినవారే ఇప్పుడు తన డేట్స్‌ కోసం ఎదురుచూడటం గర్వంగా అనిపిస్తున్నదని చెప్పింది కియారా అద్వాణీ. ‘భరత్‌ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘కబీర్‌సింగ్‌' (‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌) ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌ తొలినాళ్లలో తన అనుభవాల్ని మీడియా వారితో పంచుకుంది కియారా అద్వాణీ. “ఫగ్లీ’ చిత్రం ద్వారా నేను హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేశాను. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. అనంతరం సినిమా అవకాశాలు రావడం కష్టమైపోయింది. ఎవరూ ఛాన్స్‌ ఇవ్వడానికి ముందుకురాలేదు. ‘ఎం.ఎస్‌. ధోని’ బయోపిక్‌లో నటించడం నా కెరీర్‌ను మార్చివేసింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలొస్తున్నాయి. దక్షిణాదిలో కూడా నాదైన ముద్రను వేయగలిగాను. ఒకప్పుడు నో చెప్పిన దర్శకనిర్మాతలే నా డేట్స్‌ కావాలని కోరడం నేను సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాను. అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది.
1645

More News