లిప్‌లాక్ ఐడియా నాదే!


Tue,June 4, 2019 12:10 AM

seven will be a visual treat nizar shafi

ప్రతిభావంతుడైన ఛాయాగ్రాహకుడిగా తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు నిజార్ షఫీ. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సెవెన్ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హవీష్ కథానాయకుడు. రమేష్‌వర్మ నిర్మాత. ఈ నెల 5న సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రపంచ వ్యాప్తంగా పేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిజార్‌షషీ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.

మా స్వస్థలం చెన్నై. సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేశాను. శక్తి శరవణన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. రోబో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర కూడా అసిస్టెంట్‌గా పనిచేశాను. తమిళంలో కొన్ని సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం తెలుగులో భలే భలే మగాడివోయ్ నేను లోకల్ మహానుభావుడు శైలజారెడ్డి అల్లుడు చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాను.

అనుకోని అవకాశం..

ఓ రోజు హవీష్ ఫోన్ చేసి మంచి కథ విన్నాను..డైరెక్షన్ చేస్తారా అని ఆఫర్ ఇచ్చారు. కథ నచ్చడంతో పాటు సినిమాటోగ్రఫీపరంగా మంచిస్కోప్ ఉన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఓ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. వాళ్లే..హీరో కార్తీక్, ఆరుగురు కథానాయికలు. విలన్ దృష్టికోణం నుంచి 7 అనే టైటిల్‌ను పెట్టాం.

ఆ ఐడియా నాదే...

ఈ సినిమాలో లిప్‌లాక్‌ల ఐడియా నాదే. కథలో భాగంగానే ముద్దు సన్నివేశాలు ఉంటాయి. తొలుత హవీష్ కిస్సింగ్ సీన్స్‌లో నటించడానికి సందేహించారు. కథాప్రకారం అవసరమని నేను కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారు. కథలో ఆరుగురు కథానాయికలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇందులో మూడు పాటలుంటాయి. వాటికి మంచి పేరొచ్చింది. రమేష్‌వర్మ చెప్పిన కథను టీమ్ అంతా కలిసి డెవలప్ చేశాం.

రత్నవేలు సంతోషించారు..

మా గురువు రత్నవేలుగారికి ఈ సినిమా ట్రైలర్లు, పాటలు పంపించాను. చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సైరా షూటింగ్‌లో ఉన్నారు. సినిమా చూస్తానని చెప్పారు. దర్శకుడు మారుతి కూడా 7 అవుట్‌పుట్ చూసి సంతోషించారు. దర్శకుడిగా నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రేమకథ. మరొకటి థ్రిల్లర్. త్వరలో ఏదో ఒక కథతో సినిమా చేస్తా. అదే సమయంతో ఛాయాగ్రాహకుడిగా కంటిన్యూ అవుతుంటాను.

1190

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles