సీత కోసం రాముడు


Thu,September 5, 2019 10:57 PM

Seetha Ramuni Kosam theatrical trailer

ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా నటిస్తున్న చిత్రం రామ చక్కని సీత. శ్రీహర్ష మంద దర్శకుడు. ఫణికాంత్, విశాలక్ష్మి మంద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో దర్శకుడు బి.గోపాల్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ టైటిల్ అందంగా ఉంది. మంచి సినిమాలు చేయాలనే తపన ఇంద్రలో కనిపిస్తుంది. ఎమోషనల్‌గా దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాను తెరకెక్కించారు అని అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. సీత లాంటి ఓ యువతి ప్రేమ కోసం అల్లరి రాముడు సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అని పేర్కొన్నారు. రామ్‌లీలా, వంగవీటి తర్వాత తాను నటిస్తున్న చిత్రమిదని, ప్రియదర్శి, అభయ్ కామెడీ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని ఇంద్ర చెప్పారు. ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

314

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles