ఐదుగురు అమ్మాయిల కథ

Sun,March 10, 2019 12:01 AM

కల్పిక గణేష్, గాయత్రిగుప్త, కాతెర హకిమి, నేసాఫర్‌హాది, ఉమాలింగయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీత ఆన్ ది రోడ్. ప్రణీత్ యారోన్ దర్శకుడు. ప్రణీత్, ప్రసూన్ జవహర్ నిర్మాతలు. ఈచిత్ర ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత ప్రణీత్ యారోన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూసి ఈ కథ రాసుకున్నాను. స్వేచ్ఛా జీవితాన్ని గడపాలనుకున్న ఐదుగురు అమ్మాయిలు జీవితంలో ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ. హైదరాబాద్, కర్ణాటక, గోవా వంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. సందేశంతో పాటు చక్కటి భావోద్వేగాలుంటాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇదని గాయత్రి గుప్త చెప్పింది. మహిళా దినోత్సవం రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని కల్పిక గణేష్ తెలిపింది. స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలను ఆవిష్కరిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత ప్రసూన్ జవహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

2325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles