ప్రేమలో సవారీ


Sat,July 6, 2019 11:56 PM

Savaari Movie Official Teaser Released by Director Tarun Bhaskar at Hyderabad

నందు, ప్రియాంకశర్మ జంటగా నటించిన చిత్రం సవారీ. సాహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకుడు తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో కొత్త కథలొస్తున్నాయి. సవారీ కథ వినూత్నంగా ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ లభిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. వైవిధ్యభరితమైన ప్రేమకథ ఇది. ఓ యువజంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంలా ఉంటుంది. ఈ సినిమాకు ప్రతిభావంతులైన టీమ్ కుదరింది అని దర్శకుడు చెప్పారు. హీరో నందు మాట్లాడుతూ నా కెరీర్‌లో ఇదే ఉత్తమ చిత్రమని భావిస్తున్నా. ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులు పరిచయం చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ప్రేమికుల మనోభావాలకు దర్పణంలా ఈ ఇతివృత్తం సాగుతుంది అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మోనిశ్ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సాహిత్ మోత్కురి.

738

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles