మన దగ్గర బేరాల్లేవమ్మా

Fri,November 22, 2019 11:57 PM

భయపడే వాడే బేరానికొస్తాడు..మన దగ్గర బేరాల్లేవమ్మా అని అంటున్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌రాజు సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. శుక్రవారం చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది. మీరెవరో మాకు తెలీదు. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ మీ కోసం, పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ మిలిటరీ అధికారిగా మహేష్ చెప్పే సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాల్రా..మిమ్మల్నెలా చంపుకుంటాన్రా.. అంటూ తనదైన శైలి విలక్షణ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. ైస్టెలిష్, మాస్ కోణంలో శక్తివంతంగా ఆయన పాత్ర కనిపిస్తున్నది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు..ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ ప్రకాష్‌రాజ్ చెప్పిన డైలాగ్ నవ్వులను కురిపిస్తున్నది. సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ సినిమా విడుదలకానుంది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం:రత్నవేలు.

319

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles