గోవిందుడి వజ్రకవచం


Wed,April 17, 2019 12:04 AM

Sapthagiri Speech At Vajra Kavachadhara Govinda Movie Press

లక్ష్యం గొప్పదైనప్పుడు వెళ్లాల్సిన మార్గం కూడా మంచిగా ఉండాలి. లేదంటే దేవుడు శిక్షిస్తాడనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. దేవుడు, మానవుడి మధ్య సంబంధాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం నవ్విస్తూనే భావోద్వేగానికి లోనుచేస్తుంది అని అన్నారు సప్తగిరి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వజ్రకవచదరగోవింద. నరేంద్ర యెడల, జీవీఎన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అరుణ్ పవార్ దర్శకుడు. వైభవీజోషి కథానాయిక. ఈ సినిమాలోని చైనీస్ గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదల చేసింది. సప్తగిరి మాట్లాడుతూ తొలిసారి స్ట్రెయిట్ కథతో నేను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాను. హీరోగా కాకుండా కమెడియన్‌లా సినిమాలో నటించాను. ప్రేమకథా చిత్రమ్, లవర్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరహాలో నా పాత్ర చక్కటి వినోదాన్ని పంచుతుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్ చూసి ఇది భక్తి సినిమా అనుకోవద్దు. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్, అడ్వెంచర్ హంగులు సమ్మిళితంగా సాగే వాణిజ్య చిత్రమిది. వజ్రాన్ని కవచంగా ధరించిన గోవిందు కథ ఇది. గతంలో నేను, సప్తగిరి కలిసి చేసిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కంటే రెట్టింపు నవ్వులను పంచుతుంది అని అన్నారు. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, కష్టపడి ఇష్టపడి చేసిన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మహేంద్ర, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

795

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles