రామానాయుడు కనిపించారు


Wed,December 13, 2017 11:14 PM

SivaPrasad
సప్తగిరి ఎల్‌ఎల్‌బిలో జడ్జిగా నేను చేసిన పాత్ర అందరికి నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కోసం మేము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని అన్నారు శివప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సస్తగిరి ఎల్‌ఎల్‌బి. డా॥రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చరణ్ దర్శకుడు. సప్తగిరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో శివప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సమయంలో నిర్మాత రవికిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో సప్తగిరికి తండ్రిగా నేను చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. సప్తగిరి ఎల్‌ఎల్‌బిలో జడ్జి పాత్ర కోసం నిర్మాత రవికిరణ్ నన్ను సంప్రదించారు. గౌరవప్రదమైన పాత్ర కావడంతో పాటు సాయికుమార్, సప్తగిరిలతో పోటీపడి నటించగలనా లేదా అన్న భయం తొలుత నాలో కలిగింది. సవాల్‌గా భావించి డైలాగ్‌లు, నటనతో పాటు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నటించాను. నా పాత్ర బాగుందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. కథను నమ్మి నిజాయితీగా నిర్మాత రవికిరణ్ ఈసినిమా చేశారు. ఆయనలో నాకు రామానాయుడు కనిపించారు అని అన్నారు.

709

More News

VIRAL NEWS