దేవుడితో గోవిందుడి ఆట!


Sat,June 8, 2019 11:55 PM

Saptagiri  Vajrakavachhara Govinda  is released worldwide on June 14th

సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వజ్రకవచధర గోవింద. అరుణ్ పవార్ దర్శకుడు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెండల, జీవీఎస్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో చిత్ర బృందం పాత్రికేయులు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మనం చేసే పని సరైనదైతే వెళ్లేదారి కూడా సరైనదై వుండాలి. ఇదే అంశం నేపథ్యంలో సినిమా సాగుతుంది. జబర్దస్త్ కమెడియన్స్ ఇరవై మంది కలిస్తే ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందో ఈ సినిమాలోనూ అదే స్థాయి వినోదం వుంటుంది అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ చిన్న బడ్జెట్ సినిమా ఇది. గతంలో నేను నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్‌బి చిత్రాలు ఒకటి డబ్బుని తెచ్చిపెడితే ఈ సినిమా డబ్బుతో పాటు పేరుని తెచ్చిపెడుతుంది. దేవుడికి గోవిందుడికి మధ్య జరిగే ఆట నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. వజ్రాన్ని అమ్మి తన గ్రామాన్ని ఓ యువకుడు ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథ. ఈ నెల 14న విడుదల చేస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. వైభవీ జోషి, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు నటిస్తున్నారు.

1104

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles