వజ్ర కవచధర గోవింద


Thu,January 3, 2019 01:35 AM

Saptagiri next titled Vajra Kavachadhara Govinda Movie

సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వజ్ర కవచధర గోవింద. అరుణ్ పవార్ దర్శకుడు. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైభవి జోషి కథానాయిక. అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ గోవిందు అనే సరదా దొంగ కథ ఇది. అతడికో పెద్ద లక్ష్యం ఉంటుంది. అదేమిటి? ఈ లక్ష్యసాధనలో గోవిందుకు ఎదురైన సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. యాక్షన్, భావోద్వేగాలతో పాటు వాణిజ్య హంగులు పుష్కలంగా ఉంటాయి అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తర్వాత సప్తగిరి, దర్శకుడు అరుణ్ పవార్ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాంశంతో వినూత్నంగా ఉంటుంది అని అన్నారు. అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్రజాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి.

1719

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles