సముద్రపుత్రుడి సాహసాలు


Wed,December 12, 2018 11:39 PM

Samudra Putrudu Movie Press Meet

జాసన్ మోమోవా, అంబర్ హియర్డ్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం అక్వామెన్. జేమ్స్ వాన్ దర్శకుడు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, డీసీ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని సముద్రపుత్రుడు పేరుతో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎన్వీప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. సముద్రగర్భంలో ఉన్న అంట్లాంటిస్ సామ్రాజ్యానికి ఎదురైన ఆపదను అక్వామెన్ తన శక్తియుక్తులతో ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆకట్టుకుంటుంది. అమెరికా కంటే వారం రోజుల ముందుగానే మన దేశంలో ఈ సినిమా విడుదలకానుంది. అక్వామెన్‌గాన్ జాసన్ మెమెవా నటన ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ కొత్త అనుభూతిని పంచుతాయి.సముద్రంలో తెరకెక్కించిన సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. బాహుబలి తరహాలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు.

2850

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles