పదింతలు ఎక్కువ నవ్విస్తుంది


Tue,August 6, 2019 12:50 AM

Sampoornesh Babu  Kobbari Matta movie Press Meet

హృదయకాలేయం సినిమాతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత సాయిరాజేష్ ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టడం కోసం ఎన్నో కష్టాలు పడి కొబ్బరిమట్ట తీశాడు. ఇందులో నేను త్రిపాత్రాభినయం చేశాను అని అన్నారు సంపూర్ణేష్ బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొబ్బరిమట్ట. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. ఆది కుంభగిరి, సాయిరాజేష్‌నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. నిర్మాత సాయిరాజేష్ మాట్లాడుతూ నాలుగేళ్ల శ్రమకు ప్రతిఫలమిది. ఈ ప్రయాణంలో సినిమా కష్టాలన్నీ చూశాను. సంపూర్ణేష్ చెప్పిన సింగిల్‌షాట్ డైలాగ్‌ను విడుదల చేసిన తర్వాతే బిజినెస్ పూర్తయింది. అప్పటి వరకు మా పరిస్థితి వేరుగా ఉంది. సినిమా విడుదలలో గీతా ఆర్ట్స్, దిల్‌రాజు, యూవీ క్రియేషన్స్ చక్కటి సహకారాన్ని అందించారు. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్విస్తూ హిట్ కొడతామనే నమ్మకం ఉంది అని తెలిపారు. ప్రతి ఒక్కరం ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది. సంపూర్ణేష్‌బాబుకు నటుడిగా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది. హృదయకాలేయం కంటే పదింతలు ఎక్కువ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, గాయత్రి గుప్తా, మహేష్ కత్తి తదితరులు పాల్గొన్నారు.

423

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles