మామూలుగా ఉండదు!


Sun,May 26, 2019 11:29 PM

samanthas oh baby movie teaser realesed

సమంత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ఓ బేబి. బి.వి.నందినిరెడ్డి దర్శకురాలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. నా పేరు సావిత్రి. చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలా ఉన్నావు అనేవాళ్లు...మీరు నన్ను పాతికేళ్లప్పుడు చూడాల్సింది.. అనే సంభాషణతో టీజర్ మొదలైంది. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా అని నాగశౌర్య..సమంతను ప్రశ్నించగా..నేను మంచి వయసులో ఉన్నప్పుడు మా ఆయన పోయారు. అప్పటికే నానిగాడు పుట్టేశాడు. ఇంకా మళ్లీ పెళ్లి పెటాకులు ఎందుకని..వాడ్ని పెంచి పెద్దచేశా. వాడు పెళ్లి చేసుకొని ఇద్దరిని కన్నాడు. వాళ్లూ పెళ్లీడూకొచ్చారు. నాకు వయసైపోయింది అంటూ సమంత చెప్పే డైలాగ్ చక్కటి వినోదాన్ని పంచుతున్నది.

చివరగా నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి...చూస్తారుగా అంటూ సమంత పలికిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కొరియన్ చిత్రం మిస్‌గ్రానీకి రీమేక్ ఇది. జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్‌ప్రసాద్, ఆర్ట్: విఠల్, సంగీతం: మిక్కీ జె మేయర్, నిర్మాతలు: సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యువు థామస్‌కిమ్, దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి.

1203

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles