నల్లమలను పరిరక్షించండి


Sat,September 14, 2019 12:33 AM

Samantha tweets on Nallamala Issue

నల్లమల మహారణ్యంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన యురేనియం తవ్వకాలపై అన్ని వర్గాల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పర్యావరణాన్ని ధ్వంసం చేసి, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టే చర్య ఇదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్‌దేవరకొండ, సాయిధరమ్‌తేజ్‌, అనసూయ వంటి సినీ తారలు నల్లమలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రనాయిక సమంత యురేనియం తవ్వకాల నుంచి నల్లమలను కాపాడాలని రాష్ట్రపతిని కోరింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ఓ పోస్ట్‌ చేసింది. తవ్వకాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో తాను సంతకం చేశానని, మీరు చేశారా అంటూ నెటిజన్లను ప్రశ్నించింది. సమంత ట్వీట్‌కు పెద్ద ఎత్తున ఆమె అభిమానులు మద్దతు ప్రకటించారు.

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles