లిప్‌లాక్‌లు నటనలో భాగమే


Thu,March 21, 2019 12:33 AM

Samantha opens up about her hubby Naga Chaitanya kissing scene

లిప్‌లాక్‌లు నటనలో భాగమేనని అంటోంది సమంత. ఆ సన్నివేశాల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని చెబుతున్నది. గతంలో రంగస్థలంచిత్రంలో రామ్‌చరణ్, సమంతల లిప్‌లాక్ సన్నివేశం హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే మజిలీటీజర్‌లో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ల ముద్దు సీన్ ప్రస్తుతం అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. సినిమాల్లోని లిప్‌లాక్‌లపై సమంత మాట్లాడుతూ వాస్తవానికి నటనకు మధ్య చిన్న గీతలాంటి హద్దు ఉంటుంది. దానిని అర్థం చేసుకుంటే అశ్లీలత కనిపించదు. చిత్రీకరణల్లో ముద్దుపెట్టుకోవడం, కౌగిలింతలు అన్ని నటనలో ఓ భాగంగానే ఉంటాయి. ఈ రూల్ నటీనటులందరికి వర్తిస్తుంది. అందుకు చైతూ, నేను మినహాయింపు కాదు అని తెలిపింది. తమిళంలో సూపర్ డీలక్స్ చిత్రంలో హంతకురాలిగా కనిపిస్తున్నది సమంత. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నానని చెప్పింది. రమ్యకృష్ణ, విజయ్‌సేతుపతి లాంటి ప్రతిభావంతులైన నటులతో పోలిస్తే తానే ఈ సినిమాలో అతి తక్కువ టేక్స్ తీసుకున్నానని తెలిపింది సమంత. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం విజయ్‌సేతుపతి, మిస్కిన్ 80 కంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నారు. కీలకమైన సీన్‌లో రమ్యకృష్ణ సైతం 37 టేకులు తీసుకొని పూర్తిచేశారు. అయితే నేను మాత్రం ఎప్పుడూ అయిదు టేకులకు మించి తీసుకోలేదు. నటిగా ఆ విషయంలో నేను లక్కీగా భావిస్తున్నాను. నాలోని ఉన్నతికి ఇదే తార్కాణం అని తెలిపింది.

2394

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles