వెధవలకే మంచి పెళ్లాలు..


Fri,February 15, 2019 09:14 AM

samantha naga chaitanya akkineni valentines day special majili movie teaser out

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్..దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికులరోజు సందర్భంగా గురువారం టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. క్రికెటర్‌గా బ్యాటింగ్‌లో ఫోర్లు, సిక్సులు కొడుతూనే మరో పార్శంలో ప్రేమలో విఫలమై ధిక్కార స్వభావుడిగా మారే వ్యక్తిగా నాగచైతన్య, భర్తే ప్రపంచంగా బతికే మధ్య తరగతి గృహిణిగా సమంత కనిపిస్తున్నారు. నీకో సంవత్సరం టైమ్ ఇస్తున్నాను, ఈలోగా సచిన్ అవుతావో, సోంబేరి అవుతావో నీ ఇష్టం.... ఒక్కసారిపోతే మళ్లీ తిరిగిరాదు, అది వస్తువైనా మనిషి అయినా అంటూ నాగచైతన్యను ఉద్ధేశిస్తూ రావురమేష్ చెప్పిన సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది మా ఆయనకు మంచు ప్రదేశాలంటే మహా ఇష్టం..సమంత తన భర్తను ఉద్దేశిస్తూ చెప్పడం.. నువ్వు నా రూమ్ లోపలికు రాగలవేమో కానీ నా మనసు లోకి ఎప్పటికీ రాలేవు అంటూ నాగచైతన్య సమంతకు బదులిచ్చే సంభాషణలు హృదయాల్ని హత్తుకుంటున్నాయి.

వెధవలకు ఎప్పుడు మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావు అని పోసాని డైలాగ్ చెప్పడం, వర్షంలో తడుస్తున్న భర్తనాగచైతన్యకు సమంత గొడుగు పట్టే సన్నివేశాలు చూస్తుంటే భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నాగచైతన్య, సమంత తొలిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. దివ్యాంశ కౌశిక్ మరో నాయికగా నటిస్తున్నది. గోపీసుందర్ స్వరకర్త.


8868

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles